ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై కావలి ఎమ్మెల్యే కి వినతి.

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై కావలి ఎమ్మెల్యే కి వినతి. 23-07-2026

కావలి,జూలై :23

నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని వారి నివాసం గురువారం కలిసి వినతిపత్రం అందించారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ఏపీఎస్ఆర్టీసీ ద్వారానే చేపట్టాలని, సంస్థను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరారు. 12వ వేతన సంఘం ఏర్పాటు, ఖాళీల భర్తీ, పెండింగ్ డీఏలు, అరియర్స్, ఇన్‌క్యాష్‌మెంట్ బకాయిల చెల్లింపుతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు... ఈ కార్యక్రమంలో కావలి ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ డిపో కార్యదర్శి టి రఘునాథరెడ్డి, ఉపాధ్యక్షులు కేవీ సుబ్బయ్య, కే ప్రభాకర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ టి సుధీర్ రెడ్డి, ఎంప్లాయిస్ యూనియన్ తరపున డిపో కార్యదర్శి పి. బుజ్జయ్య జిల్లా నాయకులు చెంచురామయ్య  మరియు కార్మిక పరిషత్ డిపో అధ్యక్షులు కేవీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు



google+

linkedin

Popular Posts