జీవో 396ను రద్దు చేయాలని కోరుతూ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కలిసిన స్టాంపు రైటర్లు, వెండర్లు.ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానంటూ సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే.
కావలి, జూలై :23
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన జీవో నంబర్ 396 ను తక్షణమే రద్దు చేసేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి కావలి చెందిన డాక్యుమెంట్ స్టాంపు రైటర్లు, వెండర్లు కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీవో 396 అమలులోకి రావడం వల్ల తమ వృత్తిపరమైన అవకాశాలు దెబ్బతింటున్నాయని, దీనివల్ల తమపై మరియు తమ కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని, ఐతే ఈ జీవో వల్ల తమ జీవనోపాధి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఎమ్మెల్యేకు వివరించారు. కావున ఈ విషయాన్ని ప్రభుత్వం వద్ద లేవనెత్తి, జీవో 396 ను వెంటనే రద్దు చేయించేలా అసెంబ్లీలో ప్రతిపాదించి, తమకు న్యాయం చేయాలని వారు కోరారు.వెండర్లు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానంటూ సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..