కావలి అభివృద్ధి పనులపై 5 శాఖల అధికారులతో ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి సమీక్ష

 కావలి అభివృద్ధి పనులపై 5 శాఖల అధికారులతో ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి సమీక్ష

కావలి నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి శనివారం ఐదు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ, విద్యుత్, ఆర్ అండ్ బి శాఖల అధికారులతో సమావేశమై పట్టణంలోని ప్రధాన సమస్యలు, చేపట్టాల్సిన పనులపై సవివరంగా చర్చించారు.

ఈ సందర్భంగా కావలి పట్టణంలోని రోడ్ల మరమ్మతులు, స్ట్రీట్ లైట్ల నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, ఇరిగేషన్ కాలువల శుభ్రత, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ అంతరాయాలు, రోడ్ల దెబ్బతినడం, డ్రైనేజీ సమస్యలు ఉంటే వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు.

సమన్వయంతో పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో కావలి ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, ఆర్ అండ్ బి, విద్యుత్, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు.




google+

linkedin

Popular Posts