LLB డిగ్రీ పూర్తి చేసిన I News జర్నలిస్ట్ సంజీవరెడ్డికి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆశీస్సులు..
కావలి,జూలై :27
కావలి నియోజకవర్గానికి చెందిన I News ఛానల్ జర్నలిస్ట్ సంజీవరెడ్డి ఎల్‌ఎల్‌బీ (LLB) డిగ్రీ విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి సంజీవరెడ్డిని అభినందిస్తూ,న్యాయ విద్యను అభ్యసించిన నేపథ్యంలో ప్రజా సమస్యలపై మరింత అవగాహనతో పనిచేస్తూ, ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి న్యాయాన్ని గెలిపించే విధంగా సేవలు అందించాలని సూచిస్తూ ఆశీర్వదించారు.
సంజీవరెడ్డి మాట్లాడుతూ,ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆశీస్సులు తనకు మరింత బాధ్యతను గుర్తుచేశాయని, రానున్న కాలంలో ప్రజా సమస్యలను నిష్పాక్షికంగా వెలుగులోకి తీసుకువస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు సాగుతానని తెలిపారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు, మీడియా మిత్రులు సంజీవరెడ్డికి ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పూర్తి చేసినందుకు అభినందనలు తెలియజేసి, ఆయన భవిష్యత్తు మరింత విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు..