ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశీస్సులతో త్వరలో 200 కోట్లతో కావలి పట్టణ అభివృద్ధి.. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
కావలి 40 వార్డుల అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమీక్ష సమావేశం..
డ్రింకింగ్ వాటర్,రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారులకు ఎమ్మెల్యే కీలక ఆదేశాలు
కావలిని కనకపట్నంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే స్పష్టం..
కావలి మున్సిపాలిటీలో వైట్ రేషన్ కార్డు కలిగిన అర్హులకు రూ.2,000కే ట్యాప్ కనెక్షన్ అందించనున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి వార్డులో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు
కావలి, జూలై:27
కావలి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే దగుమాటి కావ్య కృష్ణారెడ్డి మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలోని 40 వార్డులకు సంబంధించిన తాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సమస్యలు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, మౌలిక సదుపాయాలు, ప్రజా సమస్యలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.ప్రతి వార్డులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలకు అందించే సేవల్లో నాణ్యత, పారదర్శకత ఉండాలని, ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు పనిచేయాలని సూచించారు.గత కొంతకాలంగా కావలి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగిస్తూ ప్రతి ప్రాంతంలో అభివృద్ధి కనిపించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణంలోని రోడ్ల విస్తరణ, సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, తాగునీటి సరఫరా బలోపేతం, విద్యుత్ సదుపాయాల అభివృద్ధి వంటి పనులు ప్రాధాన్యతతో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.కావలి పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆధునికంగా తీర్చిదిద్దడమే తమ సంకల్పమని, ప్రజలు కోరుకునే ప్రతి అభివృద్ధి పనిని దశలవారీగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి వేగవంతం అవుతుందని సూచించారు.
ఈ సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే మరో కీలక అంశాన్ని ఎమ్మెల్యే వెల్లడించారు. కావలి మున్సిపాలిటీ పరిధిలో తెల్ల రేషన్ కార్డు కలిగిన అర్హులైన కుటుంబాలకు కేవలం రూ.2,000కే మున్సిపాలిటీ ట్యాప్ కనెక్షన్ (Tap Connection) అందించే కార్యక్రమాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం మరింత చేరువ అవుతుందని పేర్కొన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆశీస్సులతో కావలి పట్టణంలోని 40వ వార్డులో 200 కోట్ల రూపాయలతో నూతన వర్కులకు శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు..సమావేశంలో వార్డు వారీగా పెండింగ్‌లో ఉన్న పనులను సమీక్షించిన ఎమ్మెల్యే, ప్రతి సమస్యను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండే పరిపాలనతో పాటు వేగవంతమైన అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కావలిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులను మరింత బలోపేతం చేయనున్నట్లు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కావలి మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం,5వ క్లస్టర్ ఇంచార్జ్ మలిశెట్టి విజయలక్ష్మి పట్టణ ఉపాధ్యక్షుడు దేవరకొండ శ్రీను, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు దావులూరి దేవకుమార్,మున్సిపల్ అధికారులు,తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్చార్జిలు, క్లస్టర్ ఇన్చార్జిలు, తదితరులు పాల్గొన్నారు..