విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి

 విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి

కావలి, జూలై 24:

విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కావలి ఆర్డీవో కార్యాలయ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కావలిలోని ఆరు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు, విద్యార్థినులకు దుప్పట్లు, రగ్గులు, టవళ్లు, స్వెట్టర్లు, నైట్ డ్రస్సులు, షూ-సాక్స్‌లను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు హర్షాతిరేకాలతో ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థులే దేశ భవిష్యత్తుకు బలమైన పునాది అని అన్నారు. విద్య అనేది జీవితాన్ని మార్చే శక్తి అని, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని  ఆకాంక్షించారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు విద్యకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతి, దుస్తులు, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా క్రమశిక్షణతో చదువుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.ఈ సందర్భంగా రాష్ట్ర విద్య, శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల అభివృద్ధిపై చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను ఎమ్మెల్యే ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల అభివృద్ధి కోసం మంత్రి నారా లోకేష్ వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆధునిక విద్య, డిజిటల్ లెర్నింగ్, మెరుగైన మౌలిక వసతులు, అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని, ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను పొందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. పేద విద్యార్థులు కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు.విద్యార్థులు కేవలం పుస్తక విద్యకే పరిమితం కాకుండా మంచి నడవడి, క్రమశిక్షణ, సమయపాలన, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలని సూచించారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదవాలని, ఉపాధ్యాయుల సూచనలు పాటించాలని చెప్పారు.ఈ 

కార్యక్రమంలో కావలి ఆర్డీవో డి. ఎలీషా, కావలి మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, టిడిపి సీనియర్ నాయకులు గుంటుపల్లి రాజకుమార్ చౌదరి,సంక్షేమ శాఖ అధికారులు,ప్రజాప్రతినిధులు, వార్డెన్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.


google+

linkedin

Popular Posts