వైద్య చికిత్సకు రూ.1.27 లక్షల సీఎంఆర్ఎఫ్ సహాయం అందించిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు
కావలి, జూలై 24:
కావలి ఎమ్మెల్యే కార్యాలయంలో ఈరోజు గౌరవ కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు, కావలి రూరల్ మండలం అన్నగారిపాలెం పంచాయతీ పరిధిలోని ఒట్టూరు గ్రామానికి చెందిన శ్రీమతి పొన్నాడి అన్నపూర్ణమ్మ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.1,27,657/- విలువైన ఎల్‌ఓసీ (LOC) ఆర్థిక సహాయ పత్రాన్ని అందజేశారు.
శ్రీమతి పొన్నాడి అన్నపూర్ణమ్మ గారు ఇటీవల అనారోగ్యానికి గురై గుంటూరులోని ఆర్క్కా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స పొందుతున్నారు. వైద్యుల సూచన మేరకు చికిత్సకు అధిక వ్యయం అవసరమవడంతో, వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారిని కలిసి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.1,27,657/- ఆర్థిక సహాయం మంజూరు అయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ సహాయం అందడంతో వైద్య చికిత్స ఖర్చుల భారం కొంత మేర తగ్గి తమ కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీమతి పొన్నాడి అన్నపూర్ణమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, ఆపద సమయంలో అండగా నిలిచి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేసిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. – ఎమ్మెల్యే గారి కార్యాలయం, కావలి.