కావలి మండలంలో వైకాపాకు భారీ షాక్: టిడిపిలో చేరిన 22 కుటుంబాలు..
- చలంచర్ల పంచాయతీ పేపార్లవారిపాలెం గ్రామం నుంచి వైసీపీ కీలక నేతలు చేరికలు..
- పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
కావలి, అక్టోబర్ 26:
కావలి నియోజకవర్గంలో వైయస్సార్‌సీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ విధానాలతో విసుగు చెంది ప్రతిరోజూ అనేక కుటుంబాలు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాయి.
తాజాగా, కావలి మండలం చలంచర్ల పంచాయతీ పేపార్లవారిపాలెం గ్రామానికి చెందిన కీలక నేత పేపాల చంద్రమోహన్ ఆధ్వర్యంలో సుమారు 22 కుటుంబాలకు చెందిన వైసిపి కార్యకర్తలు, నాయకులు టిడిపిలో చేరారు. కావలిలోని టిడిపి కార్యాలయానికి విచ్చేసిన వీరందరికీ స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆత్మీయంగా సాదర స్వాగతం పలికారు.
పార్టీలో చేరిన నాయకులు & కార్యకర్తలు:
పేపాల చంద్రశేఖర్, పేపాల ప్రసాద్, పేపాల రవి, పేపల మాలకొండయ్య, తలపల లక్ష్మీనారాయణ, మాణికల రమణయ్య, మాణికల చెంచమ్మ, మాణికల శ్రీను, మాణికల స్వప్న, ఈగ ప్రసాద్, పొట్లూరి వెంకటేశ్వర్లు, పొట్లూరు పోలమ్మ, ఈగ వెంకటేశ్వర్లు, రావూరి శీలయ్య, రావూరి చెంతమ్మ, రాపూర్ బుజ్జమ్మ, కోమరగిరి శీనయ్య, కోమరగిరి తిరుపతమ్మ, పొట్లూరి నరసింహ, పొట్లూరి సుమతితో పాటు మరికొంతమంది వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సోమశిల చైర్మన్ కండ్లగుంట మధుబాబు నాయుడు, టిడిపి సీనియర్ నాయకులు చాగంటి వెంకటేశ్వర్లు, గుర్రం సునీల్, పేపాల భాస్కర్ నాయుడు, పేపాల రాంబాబు, పేపల విజయబాబు, గుడిపల్లి శ్రీహరి, తుళ్లూరు శ్రీనివాసులు, దర్శి నరేంద్ర, చలంచర్ల గణేష్, చలంచర్ల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.