వైసీపీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ పురిణి గోపాల్ టీడీపీ లో చేరిక..

 టీడీపీ లో చేరికల జోరు వైసీపీ లో రాజీనామాల పర్వం 

 వైసీపీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ పురిణి  గోపాల్ టీడీపీ లో చేరిక.. 

​కావలి / అల్లూరు:27

కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చేరికల జోరు పెరగగా, వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. అల్లూరు మండలం వెస్ట్ గోగులపల్లి గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ పురిణి గోపాల్ స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.​ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పురిణి గోపాల్,యారసి మురళి ఆధ్వర్యంలో మండలం వెస్ట్ గోగులపల్లికి చెందిన సుమారు 25 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి, టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పార్టీలో చేరిన వారికి పసుపు కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించారు.​కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తాము టీడీపీలో చేరామని, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి శ్రమిస్తామని చేరిన నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నియోజకవర్గ, మండల స్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

google+

linkedin

Popular Posts