కావలి పట్టణంలో కుటుంబ సభ్యులతో కలిసి క్యూలైన్లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలి మున్సిపాలిటీలో 85 వేలమంది తమ ఓటు హక్కును వినియోగించుకుని
కావలి పట్టణం లో అభివృద్ధికి పట్టం కట్టబోతున్నారు... కావలి ప్రజలు అభివృద్ధి సంక్షేమాన్ని ఆకాంక్షించే వ్యక్తులనీ, శాంతిని కోరుకునే వారని గత ప్రభుత్వంలోని అరాచకాలను ఇప్పుడిప్పుడే కోలుకుంటూ NDA ప్రభుత్వం లో తాము బలపరిచిన బీజేపీ అభ్యర్ధి తో పాటు 44 వార్డుల్లో పోటీ చేస్తున్న టిడిపి బిజెపి జనసేన కౌన్సిలర్లను గెలిపించబోతున్నారని,, తాను ఎమ్మెల్యేగా గెలిచిన రెండున్నర సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్నానని దాని ఫలితం ఈ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో అన్ని వార్డులు,చైర్మెన్ స్థానం గెలవబోతున్నామని, నామినేషన్ల దగ్గర నుండి,స్క్రూటిని దగ్గర వరకు వైసిపి ఎన్నో కుయుక్తులకు పాల్పడిందని మళ్ళీ అరాచకాలకు పాల్పడాలని చూసిందని తాను ప్రతిపక్షంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి ఇద్దరం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన వారిమేనని ప్రజలను గౌరవించాలని కానీ వారు ఏజంట్లు గా మారి అరాచకాలను చేయాలని చూస్తున్నారని మళ్ళీ గూండాలతో రౌడీలతో పోలింగ్ బూతులు వద్ద హాల్ చేస్తున్నారనీ ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని మాజీ ఎమ్మెల్యే పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.