కావలిలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి కీలక నేతలు | ఎంపీ, ఎమ్మెల్యే సమక్షంలో భారీ చేరికలు..!
కావలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
కావలి పట్టణంలోని 3వ వార్డుకు చెందిన మాజీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు, అడ్వకేట్ సయ్యద్ సిరాజుద్దీన్తో పాటు, 7వ వార్డుకు చెందిన వైసీపీ మైనారిటీ నాయకుడు పఠాన్ నాయబ్..తదితరులు టీడీపీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎన్నికల పరిశీలికులు డూoడి రాకేష్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..