దగదర్తి మండలం చవట పుత్తేడు గ్రామానికి చెందిన మోరా వెంకట కృష్ణయ్య - కనకమ్మ ల కుమారుడు సునీల్ వివాహ నలుగు కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వరుడును ఆశీర్వదించారు..
కావలి పట్టణంలోని వెంగలరావు నగర్ కు చెందిన కనియంపాటి మాధవరావు - స్వప్న ల కుమార్తె సౌమ్య గంధపు నలుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గారు నూతన వధువును ఆశీర్వదించారు..
కావలి పట్టణంలోని 6వ వార్డు వెంగయ్యగారిపాలెంలో జరిగిన పోలేరమ్మ పొంగళ్ళ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు.. వార్డు నాయకులు జంపాని ప్రసాద్ ఆహ్వానం మేరకు ఈ పలు ఇళ్లలో జరిగిన పొంగళ్ళ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు..