నూతన వరుడును ఆశీర్వదించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..
కావలి,బుధవారం:19
కావలి పట్టణానికి చెందిన పల్లపు చిట్టిబాబు,సుజాత దంపతుల కుమారుడు వెంకట భార్గవ్ గంధపు మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. కావలి పట్టణంలోని 29వ వార్డులో ఉన్న వారి నివాసం వద్ద ఏర్పాటు చేసిన గంధపు నలుగు రు కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుక ప్రదేశానికి చేరుకున్న ఎమ్మెల్యే గారికి వరుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు.ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు నూతన వరుడు వెంకట భార్గవ్‌ను ఆశీర్వదించారు..ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు,స్థానిక ప్రజలు మరియు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన వరుడికి శుభాకాంక్షలు తెలిపారు.