కావలిలో 38వ విడత సీఎం సహాయనిధి (CMRF) చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.

కావలిలో 38వ విడత సీఎం సహాయనిధి (CMRF) చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.

​స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సెల్ఫీ పాయింట్ వద్ద 78 మంది లబ్ధిదారులకు రూ.64.01 లక్షల విలువైన చెక్కుల అందజేత.

​కావలి నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,396 మందికి రూ.11.08 కోట్ల ఆర్థిక సాయం అందజేసినట్లు వెల్లడించిన ఎమ్మెల్యే.

​పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆపత్కాలంలో సీఎం సహాయనిధి కొండంత అండ: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.

కావలి,శనివారం ఆగస్టు:25

కావలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) 38వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సెల్ఫీ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను స్వయంగా అందజేశారు.​ఈ సందర్భంగా 78 మంది లబ్ధిదారులకు రూ.64,01,197 ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు తీవ్ర అనారోగ్యం లేదా అత్యవసర వైద్య సమయంలో సీఎం సహాయనిధి కొండంత అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.​కావలి నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,942 మందికి సీఎం సహాయనిధి మంజూరు కాగా, అందులో 1,396 మందికి రూ.11,08,62,034 విలువైన చెక్కులను అందజేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 530 దరఖాస్తులు ప్రాసెసింగ్ దశలో ఉన్నాయని, 16 దరఖాస్తులు నిబంధనల ప్రకారం తిరస్కరణకు గురయ్యాయని వివరించారు.

google+

linkedin

Popular Posts