కావలి నియోజకవర్గంలో లంచాలుకు తావు లేకుండా అర్హులకు అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లను నియమించం

కావలి నియోజకవర్గంలో లంచాలుకు తావు లేకుండా అర్హులకు అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లను నియమించం.

అంగన్వాడి వృత్తి  ఎంతో గౌరవమైనది... త్వరలో నియోజకవర్గంలో సొంత అంగన్వాడి కేంద్రాలను నిర్మిస్తాం.. 

అంగన్వాడీలకు నియామక పత్రాల అందజేత..ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా ​338 కేంద్రాలకు ఎలక్ట్రిక్ స్టవ్‌లు, ప్రెషర్ కుక్కర్లు పంపిణీ..

​కావలి, ఆగస్టు 16 

కావలి ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నూతనంగా ఎంపికైన అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు (సహాయకులు) నియామక పత్రాల అందజేత కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అభ్యర్థులకు అధికారులతో కలిసి 21 మందికి నియామక పత్రాలను స్వయంగా అందించారు.​ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సమాజ వికాసంలో అంగన్‌వాడీ కార్యకర్తల బాధ్యత అత్యంత కీలకమైనదని అన్నారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యాభివృద్ధికి అంగన్‌వాడీ కేంద్రాలే పునాది అని స్పష్టం చేశారు.చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు గర్భిణులు, బాలింతలకు సంక్షేమ సేవలు అందిస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది నిబద్ధతను ఎమ్మెల్యే అభినందించారు. కావలి నియోజక వర్గంలో 21 మందికి  నియామక పత్రాల అత్త వాళ్ళ అందజేయడం చాలా సంతోషంగా ఉందని.. కరప్షన్ అనేది లేకుండా నిజమైన అర్హులకు అందజేయడం జరిగిందని ప్రతి ఒక్కరు కష్టపడి  మంచి పేరు తీసుకురావాలని అంగన్వాడి వృత్తి  ఎంతో గౌరవమైనది... త్వరలో నియోజకవర్గంలో సొంత అంగన్వాడి కేంద్రాలను నిర్మిస్తాం ఎమ్మెల్యే తెలిపారు..అనంతరం నియోజకవర్గ పరిధిలోని 338 అంగన్‌వాడీ కేంద్రాలకు  ఎలక్ట్రిక్ స్టవ్‌లు, ప్రెషర్ కుక్కర్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. వంట ప్రక్రియను వేగవంతం చేసి, చిన్నారులకు సకాలంలో నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు ఈ పరికరాలు తోడ్పడతాయని ఎమ్మెల్యే తెలిపారు.​ఈ కార్యక్రమంలో CDPO ఎం.  రాజ్యలక్ష్మి, కావలి రూరల్ మండలం అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, బోగోలు మండలం  టిడిపి మండల కన్వీనర్ మాలేపాటి నాగేశ్వరరావు, కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం, అంగన్వాడి సూపర్‌వైజర్లు వి. హేమావతి,ఎం. సౌజన్య, కార్యాలయ సిబ్బంది పి.జయ ప్రకాష్,సాయి ప్రవీణ్, ఈ. లక్ష్మీరాజ్యం పాల్గొన్నారు.. వివిధ శాఖల అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

google+

linkedin

Popular Posts