వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట – మహా కుంభాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు

 వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట – మహా కుంభాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు...

భవిష్యత్తులో కావలి గొప్పతనాన్ని ఎలా ఉంటుందో చెప్పిన ఏకైక దేవదేవుడు బ్రహ్మంగారిని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు..

 నెల్లూరు జిల్లా,కావలి పట్టణం లత హాల్ సెంటర్ వడ్డీపాలెం వద్ద భవ్యంగా నిర్వహించిన వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట,మహా కుంభాభిషేకం కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదివారం పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు,వార్డు నాయకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు..కావలి నియోజకవర్గం ప్రజల సంతోషంగా ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు..అనంతరం  ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ..భవిష్యత్తులో కావలిని కనకపట్నం అవుతుందనే మహిమాన్విత వాక్యాన్ని ముందుగానే ప్రకటించిన ఏకైక దేవదేవుడు బ్రహ్మంగారేనని పేర్కొన్నారు.“బ్రహ్మంగారి ఆశీస్సులతో కావలిని నిజమైన కనకపట్నం చేసి చూపిస్తా” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు...ఈ ప్రాంతం అనేక దేవాలయాలతో సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రతను కలిగి ఉందని చెప్పారు. మొట్టమొదటి బ్రహ్మంగారి ఆలయ నిర్మాణం కూడా ఇక్కడే ప్రారంభమైందని గుర్తుచేశారు. నేడు మరింత అందంగా ఆలయాన్ని తీర్చిదిద్దిన కమిటీ సభ్యులను అభినందించారు.ఈ ప్రాంత అభివృద్ధికి రూ.50 లక్షలు కేటాయిస్తున్నట్టు ప్రకటించిన ఎమ్మెల్యే…మొత్తం రూ.2 కోట్లు 20 లక్షలతో అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. కావలి పట్టణంలో అతిపెద్ద 100 అడుగుల రహదారి కూడా ఈ ప్రాంతంలో నిర్మించబడనున్నట్టు తెలిపారు...పూర్వీకులు ఈ ప్రాంతంలో దేవాలయాల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని,ఆలయాల వెనుక వైపు ఉన్న శ్రీ కలుగోళ శాంభవి ఆలయం ఈ ప్రాంత ఆధ్యాత్మిక మహత్యాన్ని పెంచుతోందని చెప్పారు.ఈ భూమి దేవా దేవుళ్ల కింకర్ల ఆశీస్సులతో నిండి ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

google+

linkedin

Popular Posts