శ్రీశ్రీశ్రీ విజయదుర్గ ఆస్థాన పీఠం 31వ వార్షికోత్సవ బ్రోచర్ ను ఆవిష్కరించి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
కావలి:బుధవారం,19
శ్రీశ్రీశ్రీ విజయదుర్గ ఆస్థాన పీఠం 31వ వార్షికోత్సవ బ్రోచర్‌ను కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి తన నివాసంలో ఉత్సవ నిర్వాహకులతో కలిసి అత్యంత వైభవంగా ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో విజయదుర్గ ఆస్థాన పీఠం వహిస్తున్న పాత్రను కొనియాడిన ఎమ్మెల్యే, మహోత్సవాలు దిగ్విజయం కావాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పీఠం శాశ్వత పీఠాధిపతి పత్రి వీర బ్రహ్మయ్య స్వామి మాట్లాడుతూ.. కావలి మండలం రాజువారి చింతలపాలెంలోని ఆస్థాన పీఠంలో ఈ నెల 21వ తేదీ శుక్రవారం నాడు 31వ ఆవిర్భావ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా బ్రోచర్ ఆవిష్కరించడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 7.00 గంటలకు: విశేష లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం 12.30 గంటలకు: భక్తులకు భక్తిశ్రద్ధలతో మహా అన్నసంతర్పణ ఈ పావన మహోత్సవానికి నియోజకవర్గ ప్రజలు, భక్తజనం అధిక సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని విజయగురువుల దివ్య ఆశీస్సులు పొందాలని పీఠాధిపతి పత్రి వీర బ్రహ్మయ్య,ఉత్సవ నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీఠం ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..