సెప్టెంబర్ 1న తుమ్మలపెంట రోడ్డుకు శంకుస్థాపన
- 9 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి మహిళల చేత శంకుస్థాపన
- డిసెంబర్ 31 నాటికి తుమ్మలపెట్ట రోడ్డు పనులు పూర్తి
- టిడిపి శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు
సెప్టెంబర్ 1వ తేదీన కావలి - తుమ్మలపెంట రోడ్డుకు శంకుస్థాపన చేస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు తెలిపారు.. మంగళవారం కావలి టిడిపి కార్యాలయంలో కావలి మండల, కావలి పట్టణ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీన 9 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేపట్టి తుమ్మలపెంట చేరుకొని రూరల్ మండలంలోని అన్ని గ్రామాల మహిళలను కలుపుకొని శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు.. డిసెంబర్ 31నాటికి రోడ్డు పనులు పూర్తి చేసి నూతన సంవత్సర వేడుకలు ఆ రోడ్డు పై చేసుకునేలా చేస్తామని అన్నారు.. ఐదేళ్లపాటు అనుభవించిన నరకానికి విముక్తి కలిగిస్తూ, రూరల్ మండలం గ్రామాల్లోని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఆ రోజు ముందుకు వచ్చి పాదయాత్రలో భాగస్వామ్యంలో అవ్వాలని, రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలని, ఆరోగ్యం సహకరించని వారు ముందుగా తుమ్మలపెంట చేరుకోవాలని ఆయన కోరారు. పట్టణ వాసులు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండలం అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు, టిడిపి కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, మొగిలి కల్లయ్య, పోతుగంటి అలేఖ్య, నాయుడు రాంప్రసాద్, పొన్నగంటి రవీంద్ర, గుర్రం సునీల్ కుమార్, బొట్లగుంట శ్రీహరి నాయుడు తిని వీధి ప్రసాద్, ఉప్పుటూరి బాల గురుస్వామి, కిరణ్, తోట వెంకటేశ్వర్లు, షేక్ మస్తాన్, రఫీ, దేవ కుమార్, రూరల్ మండల, పట్టణ నేతలు, జనసేన నాయకులు సమ్మను వెంకట సుబ్బయ్య, పొబ్బా సాయి విఠల్, తదితరులు పాల్గొన్నారు..