*ప్రతి ఇంటికీ త్రాగు నీరు అందేలా కృషి చేద్దాం*
- *అంతరాయం లేని విద్యుత్ అందించాలి*
- *రానున్న వర్షాకాలం నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలి*
- *ఉపాధి హామీ పధకంతో గ్రామాలు అభివృద్ధి*
ప్రతి ఇంటికీ త్రాగు నీరు అందేలా కృషి చేద్దామని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి తెలిపారు.. గురువారం దగదర్తి మండల సర్వ సభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో అంతరాయం లేని నిరంతర కరెంట్ సరఫరా చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.. రానున్న వర్షాకాలం నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, పారిశుధ్య చర్యలు చేపట్టాలని తెలిపారు.. ప్రతి ఒక్కరికీ జాబ్ కార్డు వచ్చేలా, ఉపాధి కలిగేలా చూడాలని అన్నారు. ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామాల రూపు రేఖలు మారనున్నాయని తెలిపారు. పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం రూ. 4.5 లక్షలు ఇవ్వనుందని, ఇల్లు లేని పేదలను గుర్తించాలని తెలిపారు