123 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు
- ఆక్రమణలు నిజం కాదని రుజువు చేస్తే బహిరంగ క్షమాపణకు సిద్ధం
- జాతీయ జెండాకు సెల్యూట్ చేయలేని వ్యక్తి ఎమ్మెల్యే పై విమర్శలు చేయడం సిగ్గుచేటు
- సెప్టెంబర్ 1న తుమ్మలపెంట రోడ్డుకు శంకుస్థాపన
- పైలాన్ విద్వంసం చేసిన కేసును రీ ఓపెన్ చేయడం జరిగింది
- విలేకరులపై దాడులు చేసిన సంస్కృతి మీది, వారిని కాపాడుకునే సంస్కృతి మాది
- వైసిపి ఇన్చార్జిగా తొలగిస్తారనే ఆందోళనతోనే ఎమ్మెల్యే కావ్య పై విమర్శలు
- ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి కనకపట్నం కాబోతుంది
- మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పై విరుచుకుపడిన తెలుగుదేశం నేతలు
కావలిలో 123 ఎకరాల ప్రభుత్వ భూమిని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరులు ఆక్రమించి లే-అవుట్ లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరిగిందని కావలి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు.. సోమవారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, దావులూరి దేవకుమార్, దేవరకొండ శ్రీను మాట్లాడారు.. మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు 123 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసింది నిజం కాదని తేలితే బహిరంగ క్షమాపణకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు.. జాతీయ జెండాను పరిశీలించటానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కనీసం జాతీయ జెండాకు సెల్యూట్ చేయకపోవడం, తిరిగి ఎమ్మెల్యే పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.. పైలాన్ కూల్చినచోట పైలానే నిర్మించాలి కదా? జాతీయ జెండా ఎందుకు అని అవమానపరిచిన మాజీ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలన్నారు. ఇంటి ముందు రోడ్డు కూడా వేసుకోలేకపోయిన మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు మాత్రం అన్ని పనులు వెంటనే పూర్తవాలని చెప్పటం సిగ్గుచేటు అన్నారు. ఎమ్మెల్యే కు సంబంధించిన క్వారీని సీజ్ చేసి రూ.143 కోట్ల జరిమానా విధిస్తే, అది మీ ప్రభుత్వ హయాంలోనే కోర్టు కొట్టి వేయడం జరిగిందని తెలిపారు.. పైలాన్ విధ్వంసం చేసిన కేసును తిరిగి ఓపెన్ చేయడం జరిగిందని, త్వరలోనే దోషులను పట్టుకొని జైలుకు పంపటం జరుగుతుందని తెలిపారు. స్వేచ్ఛగా వార్తలు రాస్తున్న విలేకరులపై దాడులు చేసిన సంస్కృతి మీదని, విలేకరులను బెదిరిస్తే ఊరుకోమని, విలేకరులకు అండగా ఉంటామని, వారిని కాపాడుకుంటామని తెలిపారు.. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని హామీల అమలుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని, సొంత నిధులు వెచ్చించి మరీ పనులు చేయిస్తున్నారని తెలిపారు.. మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి అనుచర వర్గం ఆకృత్యాలతోనే 30,948 మెజారిటీ కావ్య కృష్ణారెడ్డి సాధించడం జరిగిందని తెలిపారు.. తన అనుచర వర్గం దాడులను, దోపిడీలను మాజీ ఎమ్మెల్యే ఇప్పటికైనా తెలుసుకోవాలని హితువు పలికారు.. తుమ్మలపెంట రోడ్డుకు సెప్టెంబర్ 1వ తేదీన శంకుస్థాపన జరగబోతుందని, గత వైసిపి ప్రభుత్వం లో టెండర్ వేసిన కాంట్రాక్టర్ ఇప్పుడు పనులు మొదలు పెట్టబోతున్నారని తెలిపారు.. మీ ప్రభుత్వ హయాంలో పనులు చేయడానికి భయపడిన కాంట్రాక్టర్, నేడు పనులు చేయడానికి ముందుకు రావడం, ఆ విధంగా ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు వారికి నమ్మకం కలిగించడం జరిగిందన్నారు.. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని వైసిపి ఇన్చార్జిగా తొలగిస్తారనే ఆందోళనతో హడావిడిగా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని, ఉరుకులు, పరుగులు తీస్తూ బెంగళూరు నుండి రావటం జరిగిందని విమర్శించారు.. మాజీ ఎమ్మెల్యే వాడుతున్న భాషను ప్రజలు హర్షించటం లేదన్నారు.. కావలిని గంజాయి హబ్ గా మార్చిన ఘనత మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి అని విమర్శించారు. నకిలీ మద్యంతో ప్రాణాలు బలిగొన్న వ్యక్తి ఆయనని తెలిపారు.. రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి దోచేస్తే కావలిని ప్రతాప్ రెడ్డి దోచేశాడని విమర్శించారు.. మీలా మేము కూడా ప్రవర్తించి ఉంటే మీరు, మీ అనుచరులు తిరగగలిగేవారా? అని ప్రశ్నించారు.. అధికారులు ఇంకా మీ మత్తులోనే ఉన్నారని, వారు బయటకు వెళ్తే ఇంకా మీ అక్రమాలు బయటకు వస్తాయని తెలిపారు.. మాజీ ఎమ్మెల్యే తన ఇంటి ముందు ఆక్రమించిన స్థలం ప్రభుత్వానికి ఇస్తే, ఆ ప్రదేశంలో అంబేద్కర్ విగ్రహంతో పాటు మహనీయుల చిత్రపటాలు, ప్రతాప్ కుమార్ రెడ్డి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టడం జరుగుతుందని తెలిపారు.. త్వరలోనే పైలాన్ ను ఒక మంచి ప్రదేశంలో స్థాపించబోతున్నామని తెలిపారు.. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ప్రభుత్వం నిబంధనలు ప్రకారమే లేఅవుట్ వేయడం జరిగిందని తెలిపారు.. ప్రస్తుతం ఆయన స్థలం మాత్రమే కొని ఉన్నారని, దానికి మధ్యవర్తిత్వం చేసిన నీకు కమిషన్ ఇవ్వడం జరిగిందని, అయితే ఇప్పుడు ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదని తెలిపారు.. దామవరం ఎయిర్ పోర్టు, రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, పరిశ్రమలతో ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో కావలి కనకపట్నం కాబోతుందని తెలిపారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మొగలి కల్లయ్య, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య, డాక్టర్ ఏగురి చంద్రశేఖర్, అర్షియా బేగం, ఆలా శ్రీను, తోట వెంకటేశ్వర్లు, కావేటి చిన కోటయ్య, ఖాదర్ బాషా, రహీం, కోట రమేష్, ఇగుటూరు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు..