ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసిన ఎమ్మెల్యే కావ్య

ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసిన ఎమ్మెల్యే కావ్య

 కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అమరావతిలో కలిశారు.. కావలి నియోజకవర్గంలో చేపట్టబోతున్న అభివృద్ధి పనుల గురించి చంద్రబాబు గారికి వివరించారు.. అమృత్ పథకం పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా ఆహ్వానించారు.. కావలిలో చేపట్టబోతున్న పనులను ఆయనకు వివరించారు.. కావలి - తుమ్మలపెంట రోడ్డు, రాజుపాలెం - ఇసుకపల్లి రోడ్డు, దగదర్తి - బుచ్చి రోడ్డు పనుల వివరాలను ముఖ్యమంత్రి గారికి తెలియజేశారు.. దామవరం ఎయిర్ పోర్టు నిర్మాణ విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.. కావలి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు..

google+

linkedin