కావలి పట్టణంలోని 13వ వార్డులో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే

 నాయకుల్లా కాదు సేవకుల్లా పని చేస్తున్నాము 

- అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చంద్రబాబు పాలన 

- త్వరలో దామవరం ఎయిర్ పోర్టు నిర్మాణం 

- యువతకు భారీగా ఉద్యోగాలు కల్పిస్తాం 

- కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి వెల్లడి 

నాయకుల్లా కాదు సేవకుల్లా పని చేస్తున్నామని అందుకే ఇది మంచి ప్రభుత్వం అని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం కావలి పట్టణంలోని 13వ వార్డులో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వార్డుకు విచ్చేసిన ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. వార్డులో ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ 100 రోజుల పాలన గురించి ప్రజలకు వివరించారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం అందించనున్న పథకాలను కూడా వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 100 రోజుల పాలనలో 100కు పైగా అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగుతుందని తెలిపారు. వృద్ధులకు, అవ్వ తాతలకు పింఛన్లు ఒకేసారి రూ.1000 పెంచి రూ.4 వేలు ఇవ్వడం ఒకటైతే... మొదటి నెల ఒక్కొక్కరికీ రూ.7000లు చొప్పున ఇవ్వడం జరిగిందన్నారు. దివ్యాంగులకు పెన్షన్ రూ.6000 కు పెంచడం జరిగిందన్నారు. ప్రజల ఆస్తులను బక్షించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయడం, నిరుద్యోగులకు మెగా డీఎస్సీను ప్రకటించడం, పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటిన్ లను ప్రారంభించడం జరిగిందన్నారు. దీపావళి నుండి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకం చేపడుతున్నట్లు తెలిపారు. సూపర్ సిక్స్ అన్ని పథకాలు త్వరలో అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని తెలిపారు. వ్యాపారాలు వదిలి నేను రాజకీయాల్లోకి రావడం జరిగిందని, నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజాసేవ కొనసాగిస్తున్నాను అని తెలిపారు. ప్రతి నెలా ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామన్నారు. కావలి లో ప్రశాంత వాతావరణం కోసం, గంజాయి రహిత కావలి కోసం కృషి చేస్తున్నానని తెలిపారు. నిరంతరం కావలి ని కాపు కాస్తున్నానని తెలిపారు. 74 వయస్సులో కూడా చంద్రబాబు ఒక యువకుడిలా రాష్ట్ర అభివృద్ధి కోసం పరుగులు పెడుతున్నాడన్నారు. దామవరం ఎయిర్ పోర్టు, రామాయపట్నం పోర్టు రాకతో నియోజకవర్గం లోని యువతకు 42000 ఉద్యోగాలు రానున్నాయన్నారు. మరో భారీ పరిశ్రమ కూడా అతి త్వరలో రానున్నదని దానితో కావలి నియోజకవర్గంలోని యువత అందరికీ ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. కావలి నియోజకవర్గ అభివృద్ధి కి అనేక ప్రణాళికలు రూపొందించి ఉన్నామని, కావలి ని కనకపట్నం చేసి తీరుతానని తెలిపారు. దామవరం ఎయిర్ పోర్టు భూసేకరణ కోసం రూ. 96 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. తిరుపతి లడ్డును సైతం కల్తీ చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, టీడీపీ నాయకులు కండ్లగుంట మధుబాబు నాయుడు, పోట్లూరి శ్రీనివాసులు, మొగిలి కల్లయ్య, పోతుగంటి అలేఖ్య, పోతుగంటి శ్రీకాంత్, బీజేపీ నాయకులు సీవీసీ సత్యం, కుట్టుబోయిన బ్రహ్మానందం, మంద కిరణ్, సుందరశెట్టి సుజి, జనసేన కావలి ఇంచార్జి అలహరి సుధాకర్, పొబ్బా సాయి విఠల్, సిద్దు, సమ్మను వెంకట సుబ్బయ్య, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.


google+

linkedin