100 రోజుల్లోనే రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు - కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి వెల్లడి

 100 రోజుల్లోనే రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు

- సంక్షోభంలోనూ సంక్షేమ పధకాలు అందిస్తున్న చంద్రబాబు 

- కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి వెల్లడి  

నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వంద రోజుల్లోనే రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం బోగోలు మండలం బోగోలు మేజర్ పంచాయతీలో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బోగోలు కు విచ్చేసిన ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. బోగోలు పంచాయతీలో ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ 100 రోజుల పాలన గురించి ప్రజలకు వివరించారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం అందించనున్న పథకాలను కూడా వివరించారు. రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. పాడిపంటల పుస్తకాలను పంపిణీ చేశారు. గజమాల తో ఎమ్మెల్యే ను సత్కరించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.3000 ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి రూ.4 వేలకు పెంచడం జరిగిందని, దివ్యాంగులకు రూ.6000 కు పెంచడం జరిగిందన్నారు. ప్రజల ఆస్తులను బక్షించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయడం, నిరుద్యోగులకు మెగా డీఎస్సీను ప్రకటించడం, పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటిన్ లను ప్రారంభించడం జరిగిందన్నారు. దీపావళి నుండి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకం చేపడుతున్నట్లు తెలిపారు. సూపర్ సిక్స్ అన్ని పథకాలు త్వరలో అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని తెలిపారు. వ్యాపారాలు వదిలి నేను రాజకీయాల్లోకి రావడం జరిగిందని, నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజాసేవ కొనసాగిస్తున్నాను అని తెలిపారు. అన్ని గ్రామాలకు త్రాగునీరు అందించే విధంగా కృషి చేస్తున్నానని, మండలం లోని అన్ని గ్రామాల పొలాలకు సాగునీరు అందించేందుకు కూడా కృషి చేస్తున్నానని తెలిపారు. రాబోయే సీజన్ నాటికి ప్రతి ఒక్క ఎకరాకు నీరు అందిస్తానని తెలిపారు. మండలంలోని జడగోగుల, సాంబశివపురం రోడ్లకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని, మండలంలో రూ.5 కోట్లతో సిసి రోడ్లు డ్రైనేజీలను నిర్మించనున్నామని తెలిపారు.  ఇబ్బందికరంగా ఉన్న అన్ని విద్యుత్ స్తంభాలు, కరెంట్ తీగలను మార్చనున్నామని తెలిపారు. కౌరగుంట నుండి చేవూరు వరకు ఉన్న అన్ని రైల్వే గేట్ల వద్ద అండర్ పాస్/ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి ప్రహరీ నిర్మాణానికి పూనుకున్నామని, 2.2 లక్షల నిధులు వెచ్చించ నున్నామని తెలిపారు. ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం స్థల సేకరణ చేపట్టడానికి రూ.96 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. పారిశ్రామికంగా నియోజకవర్గం అభివృద్ధి చెందనున్నదని, 40000 ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోగోలు ఎంపిడివో అమ్మిశెట్టి వెంకట సుబ్బారావు, తహసీల్దార్ సురేష్, మండల టిడిపి అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎల్. సుధీర్, ముత్తాల వెంకయ్య, కండ్లగుంట మధుబాబు నాయుడు, బీజేపీ మండల అధ్యక్షులు నూకసాని శ్రీనివాసులు, జనసేన నాయకులు వెంకటేష్, గ్రామ సర్పంచ్, టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.







google+

linkedin