కావలి పట్టణంలోని 38వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే

 ప్రజల కోసం పరితపించే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు 

- సంక్షోభంలోనూ ప్రజలకు సంక్షేమ పధకాలు 

- త్వరలో అమృత్ పథకం పనులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం 

- కావలి ప్రజలకు ఎల్లప్పుడూ సేవకుడిగా ఉంటాను 

- ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య 

ప్రజల కోసం నిరంతరం పరితపించే వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి పేర్కొన్నారు. కావలి పట్టణంలోని 38వ వార్డులో ఆదివారం మూడవ రోజు "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో జరిగిన 100 రోజుల పాలన వివరిస్తూ ఎమ్మెల్యే కరపత్రాలు పంపిణీ చేశారు. వార్డుకు విచ్చేసిన ఎమ్మెల్యే కు స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదేళ్లూ రాజకీయ అక్కసు ప్రదర్శించి రాక్షసానందం పొందిన నిరంకుశత్వం బద్దలై ప్రజల ఆకాంక్షల నుంచి ఉదయించిన కూటమి ప్రభుత్వానికి వంద రోజులు పూర్తయిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు పట్టం కడుతూ.. అభివృద్ధే కంకణంగా... ఇచ్చిన హామీలను ఒక్కోటిగా నిజం చేస్తూ.. వైసీపీ అరాచకత్వంతో కుంటుపడ్డ నియోజకవర్గానికి మళ్లీ జవసత్వాలు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం రూపురేఖలను మార్చే దిశగా ఈ వందరోజుల్లో వడివడిగా ఎన్నో అడుగులు వేసుకుంటూ కదులుతుందన్నారు.

సంక్షోభంలోనూ సంక్షేమ పధకాలు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వం కే దక్కుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రం ముందుకు సాగుతోందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు ఫైళ్లపై సంతకాలు చేయడం జరిగిందన్నారు. ఏరోజుకొస్తాయో తెలియని ఉద్యోగుల, పెన్షన్‌దారుల జీతాలు ఠంఛనుగా ఒకటినే జమ చేస్తున్నామన్నారు. అరకొర పింఛన్‌ స్థానంలో పెంచిన పెన్షన్‌ నేరుగా లబ్ధిదారుల ఇంటికే అందజేత కార్యక్రమం, అన్న క్యాంటీన్లకు అయిదేళ్ల గ్రహణం వీడి పేదోడి ఆకలి తీర్చుతూ కళకళలాడుతున్నాయన్నారు. అవ్వ తాతల పెన్షన్ 4000, వికలాంగుల పెన్షన్ 6000 చేయడం జరిగిందన్నారు. మెగా డిఎస్సీ విడుదల చేయడం జరిగిందన్నారు. ప్రజల ఆస్తులను బక్షించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగిందన్నారు. విజయవాడ వరద బాధితులకు తక్షణ సహాయం అందించడం జరిగిందన్నారు. ఖాళీ ఖజానా నుంచి మళ్లీ ఆర్థిక పరిపుష్టి దిశగా పంచాయతీలు పయనిస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్‌సిక్స్‌ పథకాలు ప్రకటించిందన్నారు.

అందులో ఒక్కో హామీని వడివడిగా అమలు చేస్తోందన్నారు. ఇప్పటికే పింఛన్ల పెంపు అమలు చేసిందన్నారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్‌ సిలెండర్‌ అందివ్వబోతోందన్నారు. కావలి పట్టణంలో అమృత్ పథకం పైలాన్ కూల్చిన చోటనే ఐ లవ్ కావలి ఐకాన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అమృత్ పథకం పనులను త్వరలో పూర్తిచేసి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి కొత్తగా 7500 ఇళ్లకు తాగునీరు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. 2008 నుండి పెండింగ్ లో ఉన్న వైకుంటపురం ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. కావలి రైల్వేస్టేషన్లో లిఫ్టు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనపగుంట మురుగునీరు వైకుంఠపురం బావుల్లోకి ఇంకకుండా డ్రైనేజీ వ్యవస్థ ద్వారా బయటకు పంపే ఏర్పాటు చేస్తామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. కావలి నియోజకవర్గ చరిత్రలో రికార్డు మెజారిటీ అందించి కావలి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నానని ఎలాంటి సమస్య వచ్చినా ఎప్పుడైనా తెలపవచ్చని, పరిష్కరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, డిఈ సాయిరాం, టిడిపి కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, పోతుగంటి అలేఖ్య, కండ్లగుంట మధుబాబు నాయుడు, బెజవాడ రవీంద్ర, జనసేన కావలి పట్టణ అధ్యక్షుడు పొబ్బా సాయి విఠల్, సమ్మను వెంకట సుబ్బయ్య, బిజెపి కావలి పట్టణ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం, స్థానిక వార్డు నాయకులు, సచివాలయం సిబ్బంది, టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కావలి పట్టణంలోని 38వ వార్డులో ఈరోజు (ఆదివారం) మధ్యాహ్నం 3.30 గంటలకు "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమం.


















google+

linkedin