ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే
ట్రంక్ రోడ్డు పై వ్యాపారులు కలిగిస్తున్న ట్రాఫిక్ అంతరాయన్ని నివారించడానికి కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి చర్యలు చేపట్టారు. రోడ్డు పక్కన, షాపుల ఎదుట వాహనాలను పార్క్ చేసుకునే విధంగా స్థలం కేటాయిస్తూ పోల్స్ ను నాటే కార్యక్రమం ఆదివారం చేపట్టారు. పోల్ లోపల ఎలాంటి వ్యాపారాలు నిర్వహించకుండా, పోల్ అవతల మాత్రమే వ్యాపారాలు చేసుకునే విధంగా వారికి స్థలం కేటాయిస్తూ మున్సిపల్, పోలీస్ అధికారుల సమన్వయంతో పనులను చేపట్టనున్నారు. బిపిఎస్ సెంటర్ లో జరుగుతున్న ఈ పనుల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు. త్వరితగతిన పూర్తి చేసి ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించాలని కోరారు..