ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే 

- ముఖ్యమంత్రి కి ధన్యవాదములు తెలిపిన బాధిత కుటుంబ సభ్యులు 

ముందస్తు ఆర్ధిక సహాయం (లెటర్ ఆఫ్ క్రెడిట్) కింద ముఖ్యమంత్రి సహాయనిధి  నుండి వచ్చిన రూ. 2,17,200 చెక్కును కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కావలి మున్సిపాలిటీ పరిధిలోని చౌదరిపాలెం కు చెందిన వృద్ధురాలు గొంది రామలక్ష్మమ్మ గత రెండు సంవత్సరాల నుండి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. దీనితో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ని బాధిత కుటుంబ సభ్యులు కలిసి మోకాళ్ళ మార్పిడి చికిత్సకు ముందస్తుగా ఆర్ధిక సహాయం (లెటర్ ఆఫ్ క్రెడిట్) ఇప్పించవలసినదిగా కోరారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధికి వారి వివరాలు పంపి శస్త్ర చికిత్సకు అవసరమైన చెక్కును వారికి అందేలా చేశారు. నియోజకవర్గ ప్రజల బాగోగులు చూసుకుంటున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డికి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన కుటుంబ పెద్దగా అండగా ఉంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదములు తెలిపారు..



google+

linkedin