పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు
కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కావలి పట్టణానికి చెందిన ఓలేటి వెంకట శ్రీనివాస్ కుమార్ - వెంకట ఉషారాణి దంపతుల కుమారుడు హయాన్స్ జన్మదిన వేడుకలు కావలి పట్టణంలోని లేక్వ్యూ హోటల్ లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. కావలి పట్టణానికి చెందిన జిర్రా కొండారెడ్డి గారి నూతన గృహప్రవేశ కార్యక్రమం కావలి పట్టణంలోని ముసునూరులో జరిగింది. కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు ఈ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. సత్యనారాయణ స్వామి వారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కావలి రూరల్ మండలం చలంచర్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు బడుగు వెంకయ్య - కల్పన దంపతుల కుమారుడు జాలారావు వివాహం శనివారం జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినా కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు ఆదివారం చలంచర్ల గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. బోగోలు మండలం జువ్వలదిన్నె పంచాయతీ టెంకాయ చెట్ల పాలెం గ్రామానికి చెందిన ప్రళయకావేరి రాములు - గోవిందమ్మ దంపతుల కుమారుడు శ్రీను వివాహం కావలి పట్టణంలోని గొట్టిపాటి చిన సుబ్బానాయుడు కళ్యాణమండపంలో జరిగింది. ఈ వివాహ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.