ముందర పొట్టెమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి సంక్రాంతి లోపు గుడి వరకు సిమెంటు రోడ్డును వేయిస్తాను

ముందర పొట్టెమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి 

- సంక్రాంతి లోపు గుడి వరకు సిమెంటు రోడ్డును వేయిస్తాను 

- నీరందిస్తాం.. నిర్భయంగా నార్లు పోసుకోండి

- ముందర పొట్టెమ్మ తల్లిని దర్శించుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి 

ముందర పొట్టెమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, పాడిపంటలు, సుఖసంతోషాలతో ప్రజలు విరాజిల్లాలని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి అన్నారు. సోమవారం కావలి రూరల్ మండలం అన్నగారి పాలెం లోని శ్రీశ్రీశ్రీ ముందర పొట్టెమ్మ తల్లి దేవతా సహిత శ్రీశ్రీశ్రీ గంగమ్మ తల్లి కుంబాభిషేక మహోత్సవ తిరుణాళ్ల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కావలి డీఎస్పీ శ్రీధర్ తో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే స్వయంగా భక్తులకు వడ్డించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ప్రాంతాన్ని నిరంతరం రక్షిస్తున్న అమ్మ ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధి వైపు దూసుకుపోతుందని, తుమ్మలపెంట రోడ్డు కూడా త్వరలో పూర్తి కానుందని తెలిపారు. అన్నగారి పాలెం రోడ్డు నుండి గుడి వరకు సిమెంట్ రోడ్డును వేయిస్తానని, సంక్రాంతి లోపు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దయతో మన ప్రాంతంలో పరిశ్రమలు రానున్నాయని, 55,000 ఉద్యోగాలు మన యువతకు రానున్నాయని తెలిపారు. వరుణుడి దయతో చెరువులు కళకళలాడుతున్నాయని, చెరువులకు నీరు తగ్గిన అందించే బాధ్యత నేను తీసుకుంటానని, నిర్భయంగా నార్లు పోసుకోండని అన్నారు. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు,  స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


google+

linkedin