పశు గణన పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ఈ నెల 25 నుండి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు చేపట్టనున్న పశుగణనకు సంబందించిన 21వ అఖిల భారత పశుగణన పోస్టర్ ను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి  శుక్రవారం రాత్రి కావలి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పశుగణన  విషయ సేకరణకు మీ ఇంటికి వచ్చే వారికి పశువుల సమగ్ర సమాచారం అందించాలని కోరారు. మన పశు సంపద తెలియడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశు సంవర్ధక శాఖకు బడ్జెట్ కేటాయింపులు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, బొట్లగుంట హరిబాబు నాయుడు, డిడి డాక్టర్ ఎన్. మల్లారెడ్డి, ఏడి డాక్టర్ రసూల్, డాక్టర్ లక్ష్మీ శైలజ, డాక్టర్ కామేశ్వర రావు, సిబ్బంది పాల్గొన్నారు.





google+

linkedin