యాభై శాతం సభ్యత్వాలు లక్ష్యంగా పని చేద్దాం
- తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పెద్ద దిక్కుగా చంద్రబాబు
- పార్టీ సభ్యులకు ఏళ్ల వేళలా అండగా ఉంటాను
- పార్టీ సభ్యత్వ శిక్షణా కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి
కావలి నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లలో యాభై శాతం ఓటర్లు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకోవడమే లక్ష్యంగా అందరం సమిష్టిగా కలసి పని చేద్దామని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం కావలి పట్టణంలోని దొడ్ల మనోహర్ రెడ్డి - నారాయణ కల్యాణ మండపంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు పై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపును ఒక అదృష్టంగా భావించి ఆయన సంతృప్తి చెందేలా ప్రతి ఒక్కరం సభ్యత్వ నమోదును చేపడుదామని తెలిపారు. అనుకోని ప్రమాదంలో వ్యక్తి మరణిస్తే సొంత వారే పట్టించుకోని ఈరోజుల్లో చంద్రబాబు ఇంటి పెద్ద దిక్కుగా తమ పార్టీ కుటుంబ సభ్యులకు అండగా ఉంటున్నారని తెలిపారు. చనిపోయిన వెంటనే మట్టి ఖర్చుల క్రింద రూ. 10 వేలు ఇవ్వడమే కాకుండా, 5 లక్షల ప్రమాద భీమా అందజేయనున్నారని తెలిపారు. కావలికి నేను ఒక సేవకుడిని మాత్రమే అని, ప్రతి కార్యకర్తకు ఏళ్ల వేళలా అండగా ఉంటానని అన్నారు. ప్రతి కార్యకర్త ఆర్ధికంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తానని, త్వరలోనే కార్యరూపం దాల్చనున్నదని తెలిపారు. ప్రతి నిత్యం పార్టీ శ్రేణులకు ఉదయం 9 నుండి రాత్రి 11 వరకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నానని, ఇలాగే కొనసాగిస్తానని తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుండి చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించాలని తెలిపారు. ప్రతి ఒక్కరినీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా చేర్చుకోవడానికి కృషి చేయాలన్నారు. అధిక సభ్యత్వాలు చేసే వారికి పార్టీలో సముచిత స్థానం కల్పించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మరియు ఐటి మంత్రి నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర సహాయ సహకారాలతో కావలి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందని, రానున్న రోజుల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందాబోతున్నదని, పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయని తెలిపారు. సభ్యత్వ నమోదు పై ముందుగా తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, బోగోలు మండల అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, దగదర్తి మండల అధ్యక్షులు అల్లం హనుమంతరావు, అల్లూరు మండల అధ్యక్షులు బండి శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పోట్లూరి శ్రీనివాసులు, తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి అలేఖ్య, తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, ఉపాధ్యక్షులు బీద గిరిధర్, మైనారిటీ సెల్ నాయకులు షేక్ మస్తాన్, సోమశిల ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ కండ్లగుంట మధుబాబు నాయుడు, మాజీ అప్కాఫ్ చైర్మన్ కొండూరు పాలి శెట్టి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అన్నదాత మణి మాట్లాడారు. కావలి నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీ సాధించామని, అలాగే అత్యధిక సభ్యత్వాలు చేద్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా స్థాయిలో అగ్రగామి గా నిలిచేందుకు కృషి చేద్దామని అన్నారు. ట్రైనర్ చిట్టాబత్తిన కార్తీక్ సభ్యత్వ నమోదు పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.