పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
కావలి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఆండూరి శేఖర్ - రాధ దంపతుల కుమారుడు ఫనేంద్ర బాబు గంధపు నలుగు కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వరుడిని ఆశీర్వదించారు. కావలి పట్టణం 39వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు రావిపాటి రామయ్య చౌదరి - రాజ్యలక్ష్మి మనుమడు, మనుమరాళ్ల పంచెకట్టు, ఓణీల కార్యక్రమం కావలి పట్టణంలోని దొడ్ల మనోహర్ రెడ్డి కల్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. జలదంకి మండలం బ్రాహ్మణక్రాక అగ్రహారం కు చెందిన చేజర్ల క్రిష్ణారెడ్డి గారి మనవడు పంచకట్టు కార్యక్రమం జమ్మలపాలెం లోని ఎస్ విఆర్ కల్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.