చంద్రబాబు ఆశీస్సులతో నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుంది

 ప్రతి కుటుంబానికి భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

- సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీలో పేర్కొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి 

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి కుటుంబానికి భరోసా కల్పిస్తున్నారని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. గురువారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో వివిధ హాస్పిటల్లో చికిత్స పొందిన 15 మందికి సంబందించిన రూ. 26,89,866 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటికి పెద్దదిక్కుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అండగా నిలబడుతున్నారని తెలిపారు. కావలి నియోజకవర్గం లో ఇప్పటివరకు 87 మందికి రూ. 74,60,477 చెక్కులను అందజేయడం జరిగిందని తెలిపారు. 

చంద్రబాబు ఆశీస్సులతో నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుంది 

- కావలి ట్రంక్ రోడ్డుకు పార్వతమ్మ పేరు 

- మందాడి చెరువును ట్యాంక్ బండ్ గా మారుస్తాను 

- గతంలో నిలిచిన అన్నీ పనులు పూర్తి చేస్తాం 

- కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వెల్లడి 

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కావలి నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తుందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చెరువులు జలకళను సంతరించుకున్నాయని, నియోజకవర్గంలో రైతులు వరి నారుమళ్ళు వేసుకుంటూ సంతోషంగా ఉన్నారని అన్నారు. పేదలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో అనారోగ్య బాధితులకు నిధులు మంజూరు చేస్తున్న చంద్రబాబు కు ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు. వివిధ మండలాల్లో సిమెంట్ రోడ్డు పనులకు నూతనంగా రూ.7 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్డులు వేస్తున్నామని తెలిపారు. కావలి ట్రంక్ రోడ్డుకు పార్వతమ్మ పేరును ప్రతిపాదించి ముఖ్యమంత్రి చంద్రబాబు కు తెలపడం జరిగిందని, త్వరలో గెజిట్ విడుదల కానుందన్నారు. కావలి కి ఒక బైపాస్ అవసరమని నివేదికలు ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగిందని, త్వరలో కేంద్ర మంత్రి గడ్కరీ కి దానిని పంపుతానని చంద్రబాబు చెప్పడం జరిగిందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎన్నో అభివృద్ధి పనులు కావలి నియోజకవర్గంలో నిలిచిపోయాయని, త్వరలో అన్నింటినీ పూర్తి చేయటం జరుగుతుందని తెలిపారు. బృందావనం నుండి ముసునూరు వరకు 8 లైన్ల రోడ్డు త్వరలో ప్రారంభించడం జరుగుతుందన్నారు. కావలి మినీ స్టేడియం పూర్తి చేయడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నదని, ఈ విషయమై క్రీడా మంత్రి, శాప్ చైర్మన్ ఇటీవల కావలికి రావటం జరిగిందని కూడా తెలిపారు. మందాడి చెరువును ట్యాంక్ బండ్ గా మారుస్తామని, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని, చెరువుకు, రోడ్డుకు మధ్య 

ఈట్ స్ట్రీట్ ను కూడా ఏర్పాటు చేస్తామని, నిధులు కూడా మంజూరు కావడం జరిగిందని తెలిపారు. చంద్రబాబు ఆశీస్సులతో కావలిని కనకపట్నం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, బోగోలు మండల టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, కండ్లగుంట మధుబాబు నాయుడు, బండి అమర్ రెడ్డి, తిరువీధి ప్రసాద్, దేవరకొండ శ్రీను, జనిగర్ల మనోహర్, దావులూరి దేవకుమార్, భీమవరపు బాలాజీ, ఆది యాదవ్, తదితరులు పాల్గొన్నారు..



google+

linkedin

Popular Posts