మనసును ఏకాగ్రతగా ఉంచుకుంటే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు - కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

మనసును ఏకాగ్రతగా ఉంచుకుంటే ఎంతటి  లక్ష్యాన్నైనా సాధించవచ్చు - కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి 

మనసును ఏకాగ్రతగా ఉంచుకుంటే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. గురువారం కావలి పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల 23వ వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు తమ లోపాలను సరిదిద్దుకొని కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే జీవితం సుఖమయం అవుతుందని తెలిపారు. పరిపక్వానికి పరిపక్వతకు మధ్య ఉన్న దశ ఇంటర్మీడియట్ దశ అని, చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఇంకో 7 సంవత్సరాలు కష్టపడి చదివితే, జీవితాంతం ఆనందంగా ఉండవచ్చు అని తెలిపారు. ఈ సమయంలో కష్టపడితే జీవితం ఆనందమయం అవుతుందని, అదే ఇప్పుడు మనం సంతోషాల కోసం సమయం వృధా చేస్తే జీవితం కష్టాల పాలవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, పోతుగంటి అలేఖ్య, పోతుగంటి శ్రీకాంత్, దేవరకొండ శ్రీను, జనిగర్ల మనోహర్, దావులూరి దేవకుమార్, కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు..

శ్రీ చైతన్య జూనియర్ కళాశాల 23వ వార్షికోత్సవ కార్యక్రమం ప్రోగ్రాం ఫొటోస్

google+

linkedin