బోగోలు మండలం కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..
- శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శన అనంతరం అధికారులు గ్రామస్తులతో సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే..
ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కామెంట్స్..
- మార్చి 9 నుండి 15ను వరకు బిలకూట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహణకు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాం..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండి హాజర
వుతున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా ఏర్పాట్లు చేస్తున్నాం..
- అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి
- రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు,మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నాం
- శ్రీవారి ఆలయ ప్రాకారం అతిథి గృహాలు దాతల సహకారంతో గాలిగోపురం ఆలయ దిగువ భాగంలో కళ్యాణ మండపాలకు శ్రీకారం చుట్టబోతున్నాం ..
- బోగోలు నుండి కొండ బిట్రగుంట వరకు రోడ్ మరమ్మత్తులు.ముంగమూరు క్రాస్ నుండి కొండ బిట్రగుంటకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయబోతున్నాం
- స్వామి వారి బ్రహ్మోత్సవాలలో రెండు గ్రామల ప్రజలు భాగస్వాములు కావాలి..
- స్వామివారి పట్ల ప్రజలు భక్తిశ్రద్ధలతో ఉండాలి.. కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి