శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని కోరిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి.
స్వామి వారిని దర్శించుకుని అనంతరం శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను అధికారులతో కలసి పరిశీలించిన ఎమ్మెల్యే.
నెల్లూరు జిల్లా..బోగోలు మండలం కొండ బిట్రగుంట ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని అన్ని శాఖల అధికారులతో మంగళవారం ఆలయ ప్రాంగణంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ.... మార్చి నెల 9 తేదీ నుంచి 15 తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహణకు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు
.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలలనుండి భక్తులు విశేషంగా హాజరవుతారని అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా అధికారులు కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.ముఖ్యంగా విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ, ఫైర్ సిబ్బంది, మున్సిపల్ శాఖ ఆలయ పరిసర ప్రాంతాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచి బ్లీచింగ్, మంచినీటి సరఫరా, చలివేంద్రాల ఏర్పాటు, సైడ్ కాలువలను శుభ్రపరచుట తదితర పనులు చేయాలన్నారు. కోనేరు ను శుభ్రపరచడంతో పాటు ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ చేయాలని సూచించారు. అదేవిధంగా శానిటేషన్ సిబ్బందిని మూడు షిఫ్టుల్లో ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ వారు బందోబస్తు ఏర్పాటుతోపాటు రథోత్సవం రోజున ప్రత్యేక రోప్ పార్టీని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే అంతరాయం లేని నిరంతర విద్యుత్ ప్రసారానికి చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. అదేవిధంగా రథోత్సవం జరిగే అన్ని ప్రాంతాల్లో గుంతలు లేకుండా చూడాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. ప్రాథమిక చికిత్సకు అవసరమైన అన్ని మందులతో పాటు ఎండలు ఎక్కువగా ఉన్నందున ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాలలో గ్రామ ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు, స్వామి వారి పట్ల ప్రజలు భక్తి శ్రద్ధలతో ఉండాలి. దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో కోటి 65 లక్షల రూపాయల వ్యయంతో శ్రీవారి ఆలయ ప్రాకారం, మరో రెండు కోట్ల రూపాయలతో అతిథి గృహాల ఏర్పాటు, దాతల సహకారంతో గాలిగోపుర నిర్మాణాలు, ఆలయ దిగువ భాగంలో కళ్యాణ మండపాలకు శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు .బోగోలు బిట్రగుంట నుండి కొండ బిట్రగుంట వరకు రోడ్డు మరమత్తులు, ముంగమూరు క్రాస్ రోడ్డు వద్ద నుండి కొండ బిట్రగుంట వరకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయబోతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కావలి RDO ఎం.సన్నీ వంశీ క్రిష్ణ, కావలి Dsp P. శ్రీధర్, కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్, ఆలయ ఈఓ రాధాకృష్ణ, మాజీ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి, MRo సురేష్ బాబు,ఎంపిడిఓ సుబ్రమణ్యం, బోగోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాలేపాటి నాగేశ్వరరావు, రావి విజయ్ యాదవ్ యాదవ్, పలు శాఖల అధికారులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.