పారిశ్రామికంగా కావలి అభివృద్ధి చెందనుంది - కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
పారిశ్రామికంగా కావలి అభివృద్ధి చెంబోతుందని దీనితో యువతకు భారీగా ఉపాధి లభించనుందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి జరిగిన గంగమ్మ తిరుణాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గంగమ్మను దర్శించుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో కావలి శరవేగంగా అభివృద్ధి చెందబోతుందని, బ్రహ్మంగారు చెప్పినట్లు కావలి కనక పట్టణం కాబోతుందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న పెద్దపవని రోడ్డులో అండర్ పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే అన్ని ఉత్సవాలకు వేదికగా ఉండే ఈ ప్రాంతంలో మొత్తం సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయడం కోసం రూ. 50 లక్షలతో త్వరలో మంజూరు చేసి, రోడ్డును పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు వినోదాన్ని అందించడం కోసం తిరునాళ్ల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు