మోడీ అమరావతి పర్యటన విజయవంతం చేద్దాం - కావలి శాసన సభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి

మోడీ అమరావతి పర్యటన విజయవంతం చేద్దాం - కావలి శాసన సభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి

మే 2వ తేదీన అమరావతిలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం చేద్దామని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. మోడీ అమరావతి పర్యటన నిమిత్తం చిలకలూరిపేట ఇన్చార్జిగా కావ్య క్రిష్ణారెడ్డి ని తెలుగుదేశం పార్టీ నియమించింది. సోమవారం చిలకలూరిపేటకు విచ్చేసిన కావ్య క్రిష్ణారెడ్డికి స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఘన స్వాగతం పలికారు. అనంతరం కూటమి నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కావ్య క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర ప్రజల రాజధాని అమరావతి కి వచ్చే ప్రధానికి పెద్ద ఎత్తున జనంతో స్వాగతం పలుకుదామని, నియోజకవర్గంలోని నాయకులు ఆ విధంగా చర్యలు చేపట్టేలా కృషి చేద్దామని తెలిపారు.

google+

linkedin