ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు -ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..
దాన గుణానికి, పరమత సహనానికి, భక్తి భావానికి రంజాన్ పండుగ ప్రతీక అని, ముస్లిం సోదర సోదరీమణులు ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కోరారు.కావలి నియోజకవర్గం లోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మండు వేసవిలో చిన్న పెద్ద తేడా లేకుండా నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలు సోమవారం దీక్షలు ముగించనున్న నేపథ్యంలో అందరికీ అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ప్రతి ఏటా తాము సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని రంజాన్ పండుగను పురస్కరించుకొని పేదవారికి దానం చేయడం గొప్ప విషయమన్నారు. మనుషులంతా ఒక్కటేనని, సన్మార్గంలో నడవాలని, నీతి నిజాయితీగా బ్రతకాలని ఖురాన్ సూచిస్తుందన్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం బాధ్యతగా భావించాలన్నారు. దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ముస్లిం సోదరులు ప్రార్థనలు చేయాలని ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కోరారు