కావలి అభివృద్ధికి విపిఆర్ సహకారం మరువలేనిది

కావలి అభివృద్ధికి విపిఆర్ సహకారం మరువలేనిది

- కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తాను

- కావలిని కనక పట్టణం చేసి తీరుతాను 

- టిడిపి, బిజెపి, జనసేన ఆత్మీయ సమావేశంలో వెల్లడించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

కావలి అభివృద్ధికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందిస్తున్న సహకారం మరువలేనిదని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం కావలి పట్టణంలోని మినీ స్టేడియంలో టిడిపి, బిజెపి, జనసేన పార్టీ ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, కావలి నియోజకవర్గం జనసేన ఇన్చార్జి అలహరి సుధాకర్, బిజెపి కావలి నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ సివిసి సత్యం, బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ బుడంగుంట మీదుగా జగనన్న కాలనీ వైపు ముసునూరులో పమిడి కాలేజీ స్కూల్ దగ్గర హైవే ఎక్కేలా కావలి బైపాస్ కు, కావలి ట్రంక్ రోడ్డు విస్తరణ కు ఎంపీ కృషి చేయడం జరిగిందని తెలిపారు. అతిపెద్ద బిపిసిఎల్ పరిశ్రమ రావడానికి కృషి చేసింది కూడా ఎంపీ వేమిరెడ్డి అని తెలిపారు. కావలి ట్రంక్ రోడ్డు విస్తరణలో డ్రైన్ టు డ్రైన్ కి రూ.17 కోట్ల మంజూరయి టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. బైపాస్ కోసం అధికారులు వచ్చి పరిశీలించడం జరిగిందన్నారు.  త్వరలోనే బైపాస్ కూడా మంజూరు కాబోతుందని తెలిపారు. అల్లూరు ప్రాంతంలో కూడా బైపాస్ రావాల్సిన అవసరం ఉందని, అల్లూరుకు ఆ రోడ్డు కూడా వేస్తే మన కావలి లో ఇక రోడ్ల పరంగా ప్రజలకు ఏ రకమైన అసౌకర్యంగా జరగకుండా ఉంటుందని తెలిపారు. ఆ రోడ్డు కూడా వచ్చేలా చూడాలని ఎంపీ ని కోరారు. అల్లూరు నగర పంచాయతీకి సెంట్రల్ లైటింగ్ కూడా ఎంపీ చొరవతో మంజూరు కావడం జరిగిందని తెలిపారు. ఆగిపోయిన దామవరం ఎయిర్ పోర్టు భూసేకరణ ప్రక్రియ ప్రారంభం అయిందని తెలిపారు. రూ.30 కోట్లు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. Aబిట్రగుంట రైల్వే అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నామని తెలిపారు. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ని ఇక్కడ పెడితే 10వేల మందికి ఉద్యోగాలు అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందని, నేను ముఖ్యమంత్రికి నివేదికలు ఇవ్వడం జరిగిందన్నారు. వేమిరెడ్డి, బీద రవిచంద్ర, బీద మస్తాన్ రావు తో కలిసి తప్పకుండా అతి తొందరలో బిట్రగుంటకు కూడా ఒక శుభవార్తని అందించే కార్యక్రమానికి నాంది పలకబోతున్నామని అన్నారు. ఇద్దరి ద్వేయం ఒకటే అని ఈ కావలిని అభివృద్ధి చేయటమే అని, అది నిరంతరం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే గా 10 నెలల కాలం పూర్తఅయిందని, కార్యకర్తల జీవితాల్లో వెలుగులు నింపటానికి, వారి సంక్షేమానికి త్వరలో ఒక కార్యాచరణ చేపట్టి, సహకారాలు అందిస్తామని తెలిపారు. కావలి గడ్డ మీద చేసే ప్రతి పని బిజెపి, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలకు ఇచ్చేలా చూస్తానని తెలిపారు. కావలి ని కనకపట్టణం చేయడమే తన ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.. 


google+

linkedin