కనమర్లపూడి" పై ధ్వజమెత్తిన "అలేఖ్య"
వైసీపీ ఆర్యవైశ్యనేత కనమర్లపూడి నారాయణ పై టిడిపి నాయకురాలు ప్రముఖ ఆర్యవైశ్య మహిళ నేత దివంగత నేత యానాదిశెట్టి కుమార్తె పోతుగంటి అలేఖ్య స్థానిక టిడిపి కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫైర్ అయ్యారు
కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వ లేక వైసీపీ నేత మా నాన్నగారిని గురువు అని చెప్పుకుంటూ తిరిగే కణమర్లపూడి నారాయణ నాన్నగారి విగ్రహం పై రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని హితువు పలికి ఇకనైనా ప్రవర్తన మార్చుకొని మాట్లాడేటప్పుడు ముందు వెనక తెలుసుకొని మాట్లాడాలని అన్నారు
గురువు అని చెప్పుకునే నువ్వు అసులు గురువు మీద గురుభక్తి ఉందా?
గురువు విగ్రహం స్థలం విషయంలో రాజకీయ0 చేసింది నువ్వు కాదా
వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ పేరుతో ఆదివారం ఉదయం నువ్వు మాట్లాడిన మాటలు వింటే నీకు గురువు పై గురుభక్తి ఉందో లేదో అర్థమవుతుంది
గురువు విగ్రహం పెట్టిన రోజు మొక్కుబడిగా ఆలయ కమిటీ వారు వచ్చి విగ్రహ ఆవిష్కరణ సమయంలో జారుకున్నారు ఇదేనా గురుభక్తి అంటే
అదేమని కొందరు ఆర్యవైశ్యులు అడగగా ఆలయ కమిటీ లో మీటింగ్ ఉందని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం మీకే తెలియాలి
ఇదేనా ఆలయ కమిటి శాశ్విత గౌరవాద్యక్షులు అయిన "గ్రంధి" కి ఆలయ కమిటివారు ఇచ్చే విలువ
విగ్రహం పెట్టి వారం రోజులకి ఆలయ కమిటీ వారు గ్రంధికి నివాళులర్పించడం.... గురువుపై నీ కపటి ప్రేమ ఎంతో,మీ గురు భక్తి ఏమిటో అర్థం అవుతుంది ఆర్య వైశ్యలలో
నిన్నటి రోజున నీ నిజస్వరూపం ఆర్యవైశ్యలు అందురుకి తెలిసింది
ఆర్య వైశ్యులకు గౌరవం తెచ్చిన వ్యక్తి,ఇచ్చిన మాటతప్పకుండా,సొంత నిధులతో గ్రంధి విగ్రహంపెట్టి,గ్రంధి కీర్తి ప్రతిష్టలు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసిన అభివృద్ధి ప్రదాత మా,మన ఎమ్మెల్యే "శ్రీకావ్య కృష్ణారెడ్డి" అని కొనియాడారు👍