సేవకు నిలువెత్తు రూపం వేమిరెడ్డి

 సేవకు నిలువెత్తు రూపం వేమిరెడ్డి

- సంపాదించిన దాన్ని ప్రజలకు పంచడం విపిఆర్‌కే సాధ్యం

- దివ్యాంగులకు భరోసాగా నిలుస్తూ ట్రై సైకిళ్ల అందజేత

- మానవసేవే మాధవసేవ అనేమాటను నిజం చేస్తూ ముందుకు

దివ్యాంగుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూ....కావలి పట్టణంలో పండగ వాతావరణంలో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా సాగింది. నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్‌ ఫౌండేషన్ తరఫున ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారితో కలిసి చేపట్టిన ఈ కార్యక్రమంలో నడవలేని దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందిస్తూ.. వారి వద్దకు వెళ్లి యోగక్షేమాలు అడుగుతూ ముందుకు సాగారు. ఒక్కొక్కరికి రూ.40 వేలు విలువచేసే ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ ను ఉచితంగా అందజేయడం పట్ల దివ్యాంగులు నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జీవితంలో అందరూ డబ్బు సంపాదిస్తారని, కొద్ది మందికి మాత్రమే ప్రజలకు పంచే మంచి మనసు ఉంటుందన్నారు. నిజమైన నీతిమంతుడు, నిజమైన సేవా తత్పరుడు, తాను  సంపాదించిన డబ్బులో కొంత భాగం దేవుడికి ఇవ్వడంతో పాటు ప్రజలకు సేవ చేస్తూ గొప్ప వారిగా నిలిచారన్నారు. ప్రతి ఒక్కరూ డబ్బు వెంట పడతారని డబ్బు బాగా సంపాదించి ధనవంతులు అవుతారన్నారు. కానీ మంచివాడు అనిపించుకోవడం ఎవరికీ ధైర్యం సరిపోదన్నారు. మానవసేవే మాధవసేవ అని తలిచి.. జిల్లా వ్యాప్తంగా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారని చెప్పారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో దివ్యాంగులను గుర్తించి దాదాపు 40 వేల విలువ చేసే ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ అందించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమన్నారు. అందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సేవలను గుర్తించి ఆయన సేవలు పార్టీకి అవసరం అని భావించి, టిడిపిలోకి ఆహ్వానించారన్నారు. వేమిరెడ్డి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో దివ్యాంగులను ట్రై సైకిళ్లు అందించే కార్యక్రమం నిర్వహించడం ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికే చెందిందన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు.. తాను రాజకీయాల్లోకి రాకముందునుంచే ప్రజాసేవ చేస్తున్నారన్నారు. టిటిడి బోర్డు మెంబర్‌, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని కలిసి బిట్రగుంట వెంకటేశ్వర స్వామి కోనేరు బాగు చేయాలని కోరామని, దానికి వేమిరెడ్డి దంపతలు అంగీకరించి 2 కోట్ల రూపాయలతో బాగు చేసేందుకు అంగీకారం తెలిపారన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ దివ్యాంగుల బాధలను చూసిన తాను వారికి ఏం చేయగలుగుతామా అన్న ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. దివ్యాంగులకు కదలిక ముఖ్యమని, వారి ఆత్మధైర్యం కోల్పోకుండా చేయడం కోసం ట్రై సైకిల్స్ అందిస్తున్నామన్నారు. ఉదయగిరితో ప్రారంభమైన ఈ కార్యక్రమం.. ప్రస్తుతం కావలిలో జరుగుతుందన్నారు. ఇప్పటివరకు దాదాపు 850 ట్రై సైకిల్స్ అందించగలిగామన్నారు. వీటిని అందించడమే కాకుండా మెయింటనెన్స్ కూడా ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే చేపడుతామన్నారు. దివ్యాంగులు జాగ్రత్తగా వీటిని నడపాలని ఆయన సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడంలోనే తనకు ఆనందం ఉందని, అందుకే పట్టుదలతో చేస్తున్నానన్నారు. మరిన్ని ప్రజాపయోగ కార్యక్రమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేల సహకారంతోనే తాను ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నానని, వారందనికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 

కార్యక్రమంలో నుడా ఛైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కావలి జనసేన ఇన్చార్జి అలహరి సుధాకర్, బిజెపి జిల్లా అధ్యక్షులు వంశీధర్ తదితరులు పాల్గొన్నారు.


google+

linkedin