రోటరీ స్వర్గధామంలో దహనశాలల శంకుస్థాపనకు ఆహ్వానం

 రోటరీ స్వర్గధామంలో దహనశాలల శంకుస్థాపనకు ఆహ్వానం

- ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ని ఆహ్వానించిన రోటరీ క్లబ్ ప్రతినిధులు

కావలి పట్టణంలోని ఉత్తర శివార్ల లో గల రోటరీ స్వర్గధామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న నాలుగు దహన శాలల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేయవలసినదిగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారిని రోటరీ క్లబ్ సభ్యులు శుక్రవారం ఆహ్వానించారు. రోటరీ స్వర్గధామం లో అంకినపల్లి రమేష్ రెడ్డి సహకారంతో సుమారు రూ.40 లక్షలతో ఈ దహన శాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కి రోటరీ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. మే 31వ తేదీ ఉదయం 7.30 గంటలకు జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి తప్పక విచ్చేయవలసినదిగా వారు ఎమ్మెల్యే ను కోరారు..



google+

linkedin

Popular Posts