మాదకద్రవ్యాల రహిత కావలిగా తీర్చిదిద్దుదాం - కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

మాదకద్రవ్యాల రహిత కావలిగా తీర్చిదిద్దుదాం. గత ప్రభుత్వంలో కావలి ని గంజాయి వనంలా మార్చిన  మాజీ ఎమ్మెల్యే, మాదకద్రవ్యాల నిర్మూలనకు యువత నడుం బిగించాలి - కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

మాదకద్రవ్యాల రహిత కావలిగా తీర్చిదిద్దుదామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల (డ్రగ్స్) దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ నుండి పెండెం సెంటర్ వరకు ప్రోహిబిషన్, ఎక్సైజ్, పోలీస్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేక నినాదాలు చేస్తూ ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ నుంచి పెండెం వారి వీధి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం యాంటీ డ్రగ్స్ పై విద్యార్థులతో ప్రమాణం చేయించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వంలో  కావలి నియోజకవర్గం లో గంజాయి వనం పెంచి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సొమ్ము చేసుకున్నారని, కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే గంజాయి నిర్మూలించామని కావలిని మాదకద్రవ్యాల రహిత కావలిగా నిర్మించుకునేందుకు యువత నడుము బిగించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీవో సన్నీ వంశీ కృష్ణ, డిఎస్పీ శ్రీధర్, పోలీస్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు...

google+

linkedin