వెంకటేశ్వరపురంను వరించిన అదృష్టం..
మత్స్యకారుల కష్టాలు తీరుస్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..
వెంకటేశ్వరపురం రూపు రేఖలు మార్చిన ఎమ్మెల్యే...
90 లక్షలతో సిసి రోడ్లు, 60 లక్షలతో త్రీఫేస్ విద్యుత్
పాతికేళ్ల కష్టాలు తీర్చిన ఎమ్మెల్యేకు మత్స్యకారులు జేజేలు...
గత 25 సంవత్సరాలుగా రోడ్లు, శిథిల వ్యవస్థకు చేరి కూలిపోతున్న విద్యుత్ స్తంభాలుతో బిక్కు బిక్కు మంటూ జీవనం సాగిస్తున్న మత్స్యకారుల సోదరులకు ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి వరాల జల్లు కురిపించారు... బుధవారం కావలి రూరల్ మండలం అన్నగారి పాలెం పంచాయితీ పరిధిలోని వెంకటేశ్వరపురం గ్రామంలో 90 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లు, 60 లక్షల వ్యయంతో రెండు త్రీఫేస్ విద్యుత్ ట్రాన్స్ఫారంలును ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, ఆర్డీవో వంశీకృష్ణ తో కలిసి ప్రారంభించారు.. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను స్థానిక నాయకులు భారీగా బాణాసంచా కాల్చి నేలతాలాలకు ,మహిళలు హరతులు ఇస్తూ ఘన స్వాగతం పలికారు....ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్న మత్యకారుల కష్టం తెలుసు కనుక అసెంబ్లీలో మత్స్యకారుల కష్టాలు తెలియజేసి అన్ని మత్స్యకారుల గ్రామాలకు సిమెంట్ రోడ్లు,విద్యుత్ లైన్లు ఇతర మౌలిక వసత్తులను సమకూరుస్తున్నామన్నారు. తనకు ఎంతో అనుబంధం ఉన్న గ్రామం వెంకటేశ్వరపురం అని చెప్పలేరు పొంగితే వెంకటేశ్వరపురం కోతకు గురవుతుందన్నారు. త్వరలోనే నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభిస్తామన్నారు. గ్రామంలో ప్రధానంగా త్రాగునీరు సమస్య తలెత్తడానికి కారణం గత వైసిపి పాలకులు అన్నారు. జలజీవన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కొళాయి మంజూరు అయితే గత వైసిపి పాలకులు కొన్ని ఇళ్లకు మాత్రమే కులాయిలు వేయించి మిగిలిన కలెక్షన్ ఇవ్వకుండా నిధులు స్వాహా చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో తప్పకుండా ప్రతి ఇంటికి కులాయి. ప్రతి ఒక్కరికి సొంత పక్క ఇల్లు,కట్టించి ఇస్తామన్నారు.. వెంకటేశ్వరపురంలో స్థలం చూసుకుంటే తన సొంత నిధులు తోటి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు.. పాతిక సంవత్సరాల మత్స్యకారుల కష్టాన్ని తీర్చిన ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు జేజేలు పలికారు.... ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపీడీవో సిహెచ్ శ్రీదేవి, కావలి రూరల్ మండలం టిడిపి అధ్యక్షులు ఆవుల రామకృష్ణ,విద్యుత్ అధికారులు, పంచాయతీ అధికారులు, సిబ్బంది, టిడిపి నాయకులు,,కార్యకర్తలు అభిమానులు,,తదితరులు పాల్గొన్నారు.