కావలి మం. ఆముదాలదిన్నె వద్ద అకస్మాత్తుగా తెగిపడ్డ విద్యుత్తు తీగలు... స్వయంగా ఆ తీగలని పక్కకి తొలగించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ...తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..

కావలి మం. ఆముదాలదిన్నె వద్ద అకస్మాత్తుగా తెగిపడ్డ విద్యుత్తు తీగలు... స్వయంగా ఆ తీగలని పక్కకి తొలగించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ...తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం ఆముదాలదిన్నె వద్ద, ఎమ్మెల్యే  కావ్య క్రిష్ణారెడ్డి 

చొరవతో ఘోర ప్రమాదం తప్పింది. కావలి మండలం ఆముదాలదిన్నె వద్ద రోడ్డుకి అడ్డంగా విద్యుత్తు తీగలు ఆకస్మికంగా తెగిపడ్డాయి. కావలి మండలం వెంకటేశ్వరపురంలో అభివృద్ధి కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తున్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి, తెగిపడ్డ విద్యుత్తు తీగలని గమనించారు. తన ప్రాణాలని పణంగా పెట్టి, స్వయంగా తానే ఆ విద్యుత్తు తీగలని పక్కకి తప్పించారు. విద్యుత్తు శాఖ అధికారులని పిలిపించి హుటాహుటీన‌ మరమ్మత్తులు చేయించారు, ప్రమాదాన్ని అరికట్టిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి స్థానిక ప్రజలు అభినందనలు తెలిపారు.

google+

linkedin