డాక్టర్ ప్రభాకర్ నాయుడు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే..
ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన డాక్టర్ ప్రభాకర్ నాయుడు,హాస్పటల్ సిబ్బంది..
ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి..
ప్రజా వైద్యులు,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ ఎన్,ప్రభాకర్ నాయుడు గారి జన్మదిన వేడులులు ఆదివారం నెల్లూరు జిల్లా,కావలి పట్టణం డాక్టర్ ప్రభాకర్ వైద్యశాలలో ఘనంగా నిర్వహించారు.పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు.ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించిన డాక్టర్ ప్రభాకర్ నాయుడు,హాస్పటల్ సిబ్బంది,వార్డు నాయకులు.జన్మదిన కేక్‌ను ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి కేక్ కట్ చేసి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారికి తినిపించారు.
అనంతరం ప్రభాకర్ నాయుడుని ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..బడుగు,బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేసే ప్రభాకర్ నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు..ఎంతోమంది పేద వాళ్లకు ఉచిత వైద్యం అందించిన మహానుభావుడు అని.డాక్టర్ వృత్తిలో రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకున్న ప్రభాకర్ నాయుడు గారికి కావలి నియోజకవర్గం ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటారని కావలి నియోజకవర్గం ఆయన చేసిన సేవలు మరువలేవని తెలిపారు. డాక్టర్ గా రాజకీయంగా ఫ్యామిలీ పరంగా సక్సెస్ ఆయన ఘనత ప్రభాకర్ నాయుడు గారిని. ఆస్తులు కర్పూరంల కరిగిపోయిన పేదవాళ్లకు సేవ చేసిన మహోన్నత వ్యక్తి ప్రభాకర్ నాయుడు గారు తన హాస్పటల్లో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి కోట్ల రూపాయలు విలువచేసే స్థలాన్ని ఉద్యోగస్తులకు ఇవ్వటం చాలా సంతోషకరమని తెలిపారు..
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి ఆశీస్సులతో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని,నియోజకవర్గం లో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తానని, కావలి ని కాపు కాస్తానని తెలిపారు.డాక్టర్ ప్రభాకర్ నాయుడు మాట్లాడుతూ..నా పుట్టినరోజు వేడుకల్లో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని.నా జీవితంలో ఎంతోమంది నాయకులను చూశారని కావ్య క్రిష్ణారెడ్డి లాంటి నిజాయితీ గల రాజకీయ నాయకున్ని చూడలేదని.కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కావ్య క్రిష్ణారెడ్డి తోనే సాధ్యమని ఇలాంటి నాయకుడు దొరకటం నియోజకవర్గ ప్రజల అదృష్టమని..గెలిచిన సంవత్సరం రోజుల్లోనే కావలి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేసి చూపించాడు..డైనమిక్ లీడర్ కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారికి ఎప్పుడు మేము అండగా ఉంటామని తెలియజేశారు..