మహమ్మద్ రఫీకి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే

మహమ్మద్ రఫీకి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే

కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు గురువారం దగదర్తి మండలం యలమంచిపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, దగదర్తి మండలం ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ భౌతిక ఖాయాన్ని దర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మహమ్మద్ రఫీ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నాయకులు పమిడి రవికుమార్ చౌదరి, దగదర్తి మండల అధ్యక్షులు అల్లం హనుమంతరావు, చేజర్ల ఇబ్రీన్, జలదంకి శ్రీహరి నాయుడు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

google+

linkedin