త్వరలోనే చంద్రబాబు చేతుల మీదుగా హార్బర్ ప్రారంభం
రాష్ట్ర గనులు భూగర్భ మరియు ఎక్సైజ్ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర
27 సంవత్సరాల కృషికి ఫలితం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్
శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర
40 శాతం సబ్సిడీ కింద బొట్లు మంజూరు
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
జువ్వలదిన్నె వద్ద ఏర్పాటు చేసిన ఫిషింగ్ హార్బర్ ను త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని రాష్ట్ర గనులు భూగర్భ మరియు ఎక్సైజ్ శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం జువ్వలదిన్నె హార్బర్ ను సందర్శించి పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అన్ని వసతులతో హార్బర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. హార్బర్లు సముద్ర సంపదను హైజినిగా ఎగుమతి చేసే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని అదేవిధంగా హార్బర్లో ఒక చేపలు పట్టడమే కాకుండా వాల్యుయేషన్ కూడా చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాల్యుయేషన్ ప్రక్రియలు అవసరమైన వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద వేట నిషేధి సమయం అయిన మార్చి 15 నుండి జూన్ 15 వరకు మత్స్యకారులకు భృతి కింద 20000 రూపాయలు అందజేయడం జరుగుతుంది అన్నారు. అంతేకాకుండా 50 సంవత్సరాలు పైబడిన వారికి పింఛన్ సదుపాయం కూడా ఉన్నది అన్నారు. ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన పై అవగాహన కల్పించాలన్నారు.
శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టు వద్ద ఉన్న ఫిషింగ్ హార్బర్ కి ప్రత్యామ్నాయంగా జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమన్నారు. 27 సంవత్సరాల కృషికి ఫలితo లభించనున్నదని తెలిపారు. కొల్లు రవీంద్ర గారి మామ గారితో మొదలై కొల్లు రవీంద్ర తోటి త్వరలో ప్రారంభింప చేసుకోవడం గొప్ప విషయం అన్నారు. కొలు రవీంద్ర గారి సహకారం చాలా గొప్పదని కొనియాడారు.
స్థానిక శాసనసభ్యులు వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ 990 మీటర్ల పొడుగున హ్యాపీ ఏర్పాటు చేయడం జరిగిందని జెట్టీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని తద్వారా చాలామందికి ఉపాధి కూడా లభించునున్నదని ఆశాభావం వ్యక్తపరిచారు.40 శాతం సబ్సిడీ కింద ఫిషింగ్ బోట్లను అందించనున్నామని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో తొలుత జువ్వలదిన్నె వద్ద కోటి 85 లక్షల 30 వేల రూపాయలతో ఆరు గ్రామాలకు కలిపి ఇంటింటికి కొల్లాయి ద్వారా మంచినీటి సరఫరా పథకానికి మంత్రి కొల్లు రవీంద్ర,శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, స్థానిక శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి లతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమం అనంతరం కావలి నియోజకవర్గ మత్స్యకారులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు....