కలుగోళ శాంభవి అమ్మవారిని దర్శించుకున్న కావలి ఎమ్మెల్యే
కావలి గ్రామ దేవత శ్రీ కలుగోల శాంభవి అమ్మవారిని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు శనివారం దర్శించుకున్నారు. శ్రీ భ్రమరాంబికా సేవా సమితి, కావలి సేవా బృందం వారి ఆహ్వానం మేరకు శ్రీ కలుగోళ శాంభవి అమ్మవారికి సారె సమర్పించే కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు.. స్థానిక లతా థియేటర్ వద్ద ఉన్న గంగమ్మ తల్లి ఆలయం వద్దనుంచి ఎమ్మెల్యే అమ్మవారి ప్రతిమ తీసుకుని మహిళలు తోటి కలుగోళ శాంభవి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే కు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి వనిత లెజండ్స్ సభ్యులు, మహిళలు, టీడీపీ నాయకులు, భక్తులు భారీగా పాల్గొన్నారు..