బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను మంత్రి కొల్లు రవీంద్ర,స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మత్స్యకారులు తో కలసి పరిశీలించారు

నెల్లూరు జిల్లా,కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను మంత్రి కొల్లు రవీంద్ర,స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర  మత్స్యకారులు తో కలసి పరిశీలించారు.ముందుగా స్థానికంగా ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి 1,45 కోట్లతో  జల్జీవన్ డ్రింకింగ్ వాటర్ స్కీంకు శంకుస్థాపన చేశారు.అనంతరం హెర్బర్ల వసతులను పరిశీలించి మంత్రి మాట్లాడారు.

గత టిడిపి ప్రభుత్వంలోని ఫిషింగ్ హార్బర్ కు శంకుస్థాపనచేయడం జరిగిందని తిరిగి టీడీపీ ప్రభుత్వంలోనే ప్రారంభించడం జరిగిందన్నారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని ఇలాంటి నాయకుడు ప్రజలకు చాలా అవసరం అని తెలిపారు.

అనంతరం కావలి నియోజకవర్గంలోని మత్స్యకారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి మత్యకారుల సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేసింది అన్నారు. త్వరలోనే సబ్సిడీపై మత్స్యకారులకు వలలు, బోట్లు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

google+

linkedin